VZM: జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తమ సేవల ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని DMHO ఎస్. జీవన్ రాణి సోమవారం ఆదేశించారు. స్కాన్ సెంటర్లు పీసీపీఎన్డీటీ చట్టం నిబంధనలు పాటిస్తూ లింగ నిర్ధారణ నేరమని తెలుపుతూ బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు.