WGL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు శివారులోని ఈద్గా మైదానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ ఛైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్, వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా, కౌన్సిలర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. నీటి వసతి, విద్యుత్ దీపాలు, పరిసరాల సుందరీకరణ పనులు రంజాన్ పర్వదినం లోపు పూర్తి చేయాలన్నారు.