BDK: ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సంఘం జిల్లా కన్వీనర్ పువ్వాళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.