MBNR: జిల్లా వ్యాప్తంగా కొందరు చెరువుల ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వాటిని కాపాడాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.