ADB: బోరజ్ మండలం పెండల్వాడలో జులాయిగా తిరుగుతున్నావని తాత ప్రభాకర్ మందలించినందుకు, మనవడు సునీల్ ఆగ్రహంతో పొలంలోని శనగ పంటకు నిప్పు పెట్టాడు. కళ్లముందే పంట బూడిద కావడంతో తాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆవేశంలో చేసిన ఈ పని వల్ల భారీ నష్టం వాటిల్లింది.