AP: తన తండ్రి హత్య విషయంలో అన్యాయం జరిగిందంటూ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలపై MP అవినాశ్ రెడ్డి స్పందించారు. వివేకాకు గుండెపోటు స్టోరీ పుట్టించిందే సునీతారెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. వివేకాను ఆయన కుటుంబమే వదిలేసిందని మండిపడ్డారు. దస్తగిరి వాంగ్మూలంపై దర్యాప్తు జరపమని సునీత ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. తాను ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తానని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు.