SRCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చందుర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేయాలన్నారు . జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు విజేందర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.