TPT: ప్రతి నెల సక్రమంగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదని మేర్లపాక గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 5న ఇవ్వాల్సిన బియ్యం 15వ తేదీ దాటినా ఇవ్వలేదని ఆరోపించారు. ముసలి వారు, వికలాంగులు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని, గతంలో తోపులాటలో కొందరు గాయపడి ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. వెంటనే రేషన్ బియ్యం అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.