NLG: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గుడిపల్లి మండల SGT ఉపాధ్యాయుడు R. శ్రీనుకు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. MEO సముద్రాల శ్రీనయ్య చేతుల మీదుగా ఈ సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో తోటి ఉపాధ్యాయులు చూపిన మానవత్వం అభినందనీయమని స్థానికులు తెలిపారు.