పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు బుక్ మై షోలో దాదాపు 15వేల టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా, R. పార్తీబన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.