KRNL: ఆదోనిలోని ESI ఆసుపత్రిని కర్నూలుకు తరలించే యోచనను తక్షణమే విరమించాలని కార్మిక సంఘాలు, ఈఎస్ఐ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ నాయకులు పీఎస్ గోపాల్, తిప్పన్న మాట్లాడుతూ.. 50 ఏళ్లుగా కార్మికులకు ఈ హాస్పిటల్ సేవలందిస్తుందన్నారు. ప్రస్తుతం డాక్టర్లు, ఈసీజీ, మందుల కొరతతో సరైన వైద్యం అందడంలేదని తెలిపారు.