TG: హైదరాబాద్‌ను పర్యావరణహితంగా మార్చేందుకు జిల్లాల నుంచి వచ్చే డీజిల్ బస్సులను నగరంలోకి రాకుండా ప్రభుత్వం కట్టడి చేయనుంది. ORR చుట్టూ టెర్మినళ్లను ఏర్పాటు చేసి, బస్సులను అక్కడి వరకే పరిమితం చేసేలా CM రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. కాలుష్యాన్ని తగ్గించి నగరాన్ని క్లీన్‌గా ఉంచడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.