PPM: ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘వాట్సాప్ గవర్నెన్స్’ తీసుకు వచ్చిందని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో స్టాండింగ్ బోర్డులను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు పాల్గొన్నారు.