E.G: రాజమండ్రిలోని జాంపేటలో ఉన్న రామాలయం వద్ద రూ.16 లక్షలు నిధులతో నిర్మించనున్న షెడ్డు నిర్మాణ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయితేనే మంచి వాతావరణంతో సమాజం ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.