SDPT: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బెజ్జంకిలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహించారు. గణాంక అధికారి గుర్రం శ్రీనివాస్ గ్రామంలో పలు కుటుంబాలను కలుసుకుని సమాచారం సేకరించారు. స్వయం ఉపాధి, ఉద్యోగాలు, కార్మికుల పరిస్థితులు, వ్యవసాయం, విద్య, వైద్యం అంశాలపై వివరాలు నమోదు చేశారు. నిత్యావసర వస్తువులు కూరగాయలు, ఔషధాల ధరలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.