WGL: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు గాయాలైన ఘటన నగరంలో సోమవారం జరిగింది. ఉర్సుగుట్ట సమీపంలోని బట్టుపల్లి పెట్రోల్ పంపు సమీపంలో బైక్పై ప్రయాణిస్తున్న కోళ్లపాక జ్యోతిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మహిళలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.