బంగ్లాదేశ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్లో వెనుకబడ్డాం. చివరి బంతి వరకు పోరాడారు. చాలా మంది యువ ఆటగాళ్లు మొదటిసారి ఇక్కడ వన్డేలు ఆడుతున్నారు. వారి ఆట తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. వారికి మేము పూర్తి మద్దతిస్తాం’ అని అన్నాడు.