BHPL: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, స్వర్ణభారతి సాహిత్య కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పరాభవ నామ సంవత్సర ఉగాది జాతీయ కవి సమ్మేళనంలో భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కవి, రచయిత గడ్డం ప్రశాంత్ కవితా గానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మునిరత్నం నాయుడు, ప్రశాంత్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.