బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో పాకిస్తాన్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు ఎలాగు మ్యాచులు గెలవదని అన్నాడు. వారు ఇకపై ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందేనని చురకలంటించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్ సైతం పాకిస్తాన్ను ఓడిస్తోందని తెలిపాడు.