వంట నూనె ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం ప్రభావంతో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ.152 నుంచి ఆన్లైన్లో ఏకంగా రూ.178కి చేరింది. ఆఫ్లైన్లోనూ రూ.168 వరకు విక్రయిస్తున్నారు. ఇక పల్లీ నూనె లీటర్ రూ.220 పైనే పలుకుతోంది. సప్లై తగ్గడంతో సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి.