నల్గొండ పట్టణంలోని 3వ వార్డు శాలిబండ ప్రాంతంలో సోమవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. వార్డు కౌన్సిలర్ అంకు రి సుమలత పర్యవేక్షణలో సిబ్బంది వార్డులోని మురికి కాలువలను (మోరీలను) శుభ్రం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలకుండా ఈ చర్యలు చేపట్టినట్లు కౌన్సిలర్ సుమలత తెలిపారు.