SRD: నిజాంపేట మండలం మాణిక్ నాయక్ తండా గ్రామపంచాయతీలో సోమవారం తాగునీటి సరఫరా కోసం పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక బోర్‌కు కొత్త కరెంటు మోటార్‌ను బిగించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ మంజుల శంకర్, పంచాయతీ కార్యదర్శి సుమ ప్రజలకు తాగునీరు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భీమ్ దేవ్, బంగారు రాజు ఉన్నారు.