మావోయిజం అంతం అయినా పోరాటాలు ఆగవని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఉద్యమాల్లో బలహీనతలు, టెక్నాలజీ ఆపరేషన్ కగార్‌కు ఉపయోగపడ్డాయని ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతల మూలాలను గుర్తించారని అందులో భాగంగా పార్టీ జనరల్ సెక్రటరీ నంబాళ్ల కేశవరావును చంపేశారన్నారు. మావోయిజం లేనప్పుడు అర్బన్ నక్సలిజం ఎక్కడిదని హరగోపాల్ ప్రశ్నించారు.