ASR: అరకులోయలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్, టీడీపీ అరకు ఇంఛార్జ్ దొన్ను దొర పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి పొట్టి శ్రీరాములు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన ఆయన ప్రాణత్యాగం చిరస్మరణీయమని అన్నారు.