ఓ తల్లి తన కుమార్తెకు వరుడిని వెతకడంలో ఎదురవుతున్న ఇబ్బందులను సోషల్ మీడియాలో పేర్కొంది. ఆమె కుమార్తె MBBS, MD పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు. ఆమె స్థాయికి తగ్గ వరుడు దొరకడం లేదని ఓ తల్లి ఆవేదన చెందింది. ముఖ్యంగా 32 నుంచి 34 ఏళ్ల వయసున్న అబ్బాయిలు ‘అంకుల్స్’లా కనిపిస్తున్నారని.. ఒకవేళ అబ్బాయి అందంగా ఉన్నా.. తన కుమార్తె చదవుకున్న స్థాయి అతనికి లేదని అసహనం వ్యక్తం చేసింది.