KDP: బ్రహ్మంగారి మఠంలోని మఠాధిపతులు వీర శివకుమార్ స్వామి, దేవాలయ శాఖ కార్య నిర్వహణ అధికారి జగన్మోహన్ రెడ్డి, తనిఖీ అధికారి జనార్ధన్ సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. మఠం సిబ్బంది ఉండి కానుకలను లెక్కించగా మొత్తం రూ. 5,09,041 ఆదాయం వచ్చిందని వారు తెలిపారు. బ్యాంక్ అధికారి తదితర ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.