రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామంలో హనుమాన్ దేవాలయం నిర్మిస్తున్నారు. నిర్మాణానికి గ్రానైట్ అవసరం ఉండటంతో గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రజల మాటకే ప్రామాణ్యంగా భావిస్తూ రూ.4 లక్షల విలువైన గ్రానైట్‌ను అందజేశారు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా నిలుస్తున్న ఆయన సేవలను గ్రామస్తులు ప్రశంసించారు.