NGKL: విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపచేయాలని కోరుతూ TVAE జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు కల్వకుర్తి సబ్ డివిజన్‌కు చెందిన ఆర్టిజన్ కార్మికులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.