హైదరాబాద్ తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ డ్రగ్ పార్టీ కలకలం రేపింది. పోలీసులు జరిపిన దాడిలో బాలీవుడ్ నటుడు అబ్దుల్ సర్వర్ సహా పలువురు పట్టుబడ్డారు. పరీక్షల్లో అబ్దుల్, మరో ఐదుగురు కొకైన్, గంజాయి వాడినట్లు తేలింది. సుమారు 300 మంది పాల్గొన్న ఈ పార్టీపై నార్కోటిక్స్ పోలీసులు కేసు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా మూలాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.