WG: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సోమవారం పెద అమీరంలో నిర్వహించారు. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఆయన చిత్రపటానికి తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు వారందరిని ఏకం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసారని వివరించారు.