TG: తెలంగాణ కవి, రచయిత, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఆయన రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని పరిస్థితులపై ఆయన ఈ పుస్తకాన్ని రచింంచారు. నందిని సిధారెడ్డికి ఈ అవార్డు రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.