ASR: ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పేషీల నుండి వచ్చే ప్రజల ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు మండల స్థాయిలో, మండల ప్రత్యేక అధికారులతో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.