KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయం ఛైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈవో రమణ సోమవారం MRO గంగయ్యను కలిశారు. ఆలయానికి సంబంధించిన రికార్డుల్లోని భూముల వివరాలను ఆయనకు అందజేశారు. ఆలయ భూములను సర్వే చేయించాలని వినతి పత్రం ఇచ్చారు. ఆలయ భూములకు సరిహద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.