MHBD: మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాధితుడు రూ. 26 వేల మొబైల్ ఇటీవల పోగొట్టుకున్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు కేసు నమోదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ లొకేషన్‌ను గుర్తించారు. ఇవాళ టౌన్ CI మహేందర్ బాధితుడికి మొబైల్‌ను అందజేశారు. పోలీస్ సిబ్బందికి బాధితుడు ధన్యవాదాలు తెలిపారు.