PLD: నరసరావుపేట పురపాలక సంఘం పరిధిలో సెన్సస్ 2027 శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. భారత ప్రభుత్వం నిర్వహించనున్న జనాభా గణనలో భాగంగా హౌస్లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్ (HLO)పై శిక్షణ అందిస్తున్నారు. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆర్డీవో బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.