TG: CWC మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. AP డిమాండ్లకు రేవంత్ సంతకం చేసి వస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇటీవల జరిగిన CWC మీటింగ్ అజెండా మొదటి అంశం.. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు అని మండిపడ్డారు. అజెండాలో నల్లమలసాగర్ లేకుంటేనే మీటింగ్ వస్తామని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.