SRD: సిర్గాపూర్ మండలం చందర్ నాయక్ తండా జీపీ పరిధిలోని వాలు నాయక్ తండాలో గాలి దుమారం కారణంగా శంకర్ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. సోమవారం స్థానిక సర్పంచ్ రుక్మిణి పుల్సింగ్, పంచాయతీ కార్యదర్శి రఫిక్ గ్రామాన్ని సందర్శించి బాధిత ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.