VZM: నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్న సీపీఐకి ప్రజలు బాసటగా నిలవాలని జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ కోరారు. సోమవారం గజపతినగరంలో గడపగడపకు సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతాంగం విద్యార్థులు యువజనలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు తదితర రంగాల వారి సమస్యల కోసం తమ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తున్నదన్నారు. అలాగే, ప్రజలు విరాళాలు అందజేయాలని కోరారు.