W.G: సౌండ్ పొల్యూషన్ లేకుండ సహకరించాలని ఉండి ఎస్సై మహ్మద్ నసిరల్లా కోరారు. ఇవాళ నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండటానికి మండలంలో దేవాలయాలు,చర్చిలు, మసీదుల్లో మైకులు బహిరంగంగా సౌండ్ పెట్టకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి ఎక్కడ బహిరంగ మీటింగ్లకు సభలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదన్నారు.