VSP: జిల్లాలో ఎస్టీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపాధి పథకాన్ని ప్రారంభించింది. ట్రైకార్, సెర్ప్ భాగస్వామ్యంతో ఎంపికైన 26 మందికి రూ.50 వేల సబ్సిడీతో పాటు రూ.3 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ఆసక్తి గల అర్హులైన మహిళలు తమ గ్రామ లేదా మండల సమాఖ్య కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ కోరారు.