ASR: 10వ తరగతి పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి ఏపీఆర్ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.