ఏలూరు: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం HPV వ్యాక్సిన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ మొదలగు వ్యాధుల నుంచి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు.