GDWL: గద్వాల శ్రీ రామాలయ దేవస్థానంలో ఈ నెల 27న నిర్వహించనున్న సీతారామ కళ్యాణ మహోత్సవానికి రావాలని బీఆర్ఎస్ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడుకు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం విశిష్టతను, కార్యక్రమాల వివరాలను కమిటీ సభ్యులు ఆయనకు వివరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.