MDK: ఖేడ్ నియోజకవర్గంలోని 190 గ్రామపంచాయితీల్లో గత BRS సర్కారు వైకుంఠధామాలు నిర్మించారు. ఒక్కో దానికి రూ. 12 లక్షలు వెచ్చించి నిర్మించారు. దహన సంస్కారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సగానికి పైగా గ్రామాల్లో ప్రారంభించకపోగా, అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలా చోట్ల గ్రామానికి కిలోమీటర్ దూరం వైకుంఠ ధామాలు నిర్మించడంతో తమ సొంత భూముల్లోనే దహన సంస్కారాలు చేస్తున్నారు.