SDPT: జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి శివారులో గల ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఉచిత ఆయుష్ మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ కే.హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సమీకృత ఆయుష్ వైద్యశాలలో ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతి వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.