NLR: వరికుంటపాడు మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలలను ME0 జి.కొండయ్య శనివారం తనిఖీ చేశారు. తూర్పు బోయమడగల, గువ్వాడి పాఠశాలల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూసి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.