ప్రకాశం: మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, ABN ఛానల్‌పై కేసు నమోదు చేయాలని కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కనిగిరిలో ఆయన పోలీసులకు లిఖిత ఫిర్యాదు అందజేశారు. వైఎస్ జగన్‌పై, పార్టీ నేతలపై, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.