ADB: రైతు భరోసాను విడతల వారీగా కాకుండా ఒకేసారి చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ మేరకు ఆయన తీవ్రంగా ఖండించారు. హామీలు నెరవేర్చేంతవరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని పేర్కొన్నారు.