MDK: రామాయంపేట మండలం సుతార్ పల్లి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరాన్ని సోమవారం గ్రామ సర్పంచ్ సునీల్ ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.