BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లి గ్రామపంచాయతీ వద్ద సోమవారం AEO ప్రశాంత్ ఆధ్వర్యంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. AEO మాట్లాడుతూ.. రైతులు తక్షణమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, పథకాలు, రుణ మాఫీ, యంత్రాల సహాయం వంటివి పొందలేరని హెచ్చరించారు.